Thursday, August 30, 2007
Tuesday, August 14, 2007
ప్రైవేటు రంగంలొ రిజర్వేషన్లు ఉండాలా?
యూ.పి ముఖ్యమంత్రి మాయావతి ప్రైవేట్ రంగంలొ కూడా రిజర్వేషన్లను అమలుపరచడానికి తగిన పనులన్ని పూర్తి చేసుకుంది. (ఈ వార్త ఇక్కడ).
* ఏవరేవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నయి?
వెనుకబడ్డ కులావారికి, ఆర్ధికముగా వెనుకబడివున్నవారికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
* ప్రైవేటు రంగంలొ ఏయే సంస్థలు ఈ రిజర్వేషన్లు పాటించాలి?
1 - కొత్తగా స్థాపించే సంస్థలకు మాత్రేమే ఇది వర్తిస్తుంది.
2 - ప్రభుత్వంలోని ఏ శాఖనుండిగాని, భూమిగాని, ఏదేని గ్రాంట్ గాని, కట్టే శిస్తులలో రాయితిగాని మరేవిధంగానైన సహాయంగాని పొందిన సంస్థలు ఈ రిజర్వేషన్లను అమలు పరచాలి.
* మరి ఏమేరకు ఈ సంస్థలు రిజర్వేషలని అమలు చెయ్యాలి?
30 శాతం దాక అమలు చెయ్యాలి.
సంభందిత శాఖా, రాష్త్ర కార్మిక శాఖ, ఆ సంస్థ యాజమాన్యం రిజర్వేషన్ని సరిగ్గా అమలుపరుస్తుందాలేదా అన్నది పర్యవేక్చ్చిస్తుంటయి.
మన ముఖ్యమంత్రిగారు కూడా దానిని మన రాష్త్రంలో కూడా ప్రయోగించి పాటించడానికి కసరత్తులు మోదలుపెట్టారు.
(ఈ వార్త ఇక్కడ).
యూ.పి వారి పాలసి విధి విధానలని తెప్పిస్తున్నారు. కూలంకషంకా దానిని పరిశీలించి బహుశ
ఈ రాష్ట్రానికి కావల్సిన, చేయాల్సిన మార్పులు చేర్పులు చేసి తగిన చట్టాన్ని అమలులోకి తీసుకువస్తారు.
దీనికి మరి మీరు ఏమంటారో తెలియజేయగలరా?
Posted by Anil Atluri at 6:55 PM 1 comments
Labels: reservations