ఒక ఐరోపా బహుళ జాతి సంస్థ కి భారత దేశంలోని హైదరాబాదులో ఒక డెవలప్ మెంట్ సెంటర్ ఉంది. ఆ సంస్థలో సుమారుగా ఒక నూట యాభై మంది దాకా పని చేస్తున్నారు.
అందులో టెస్టర్ ఉద్యోగానికి గత సంవత్సరం "కుమార్" (పేరు మార్చబడినది) ఇంటర్వ్యూకి హాజరయి ఎన్నికయ్యాడు. అతనికి మిగతా వసతులతో బాటే ఆ సంస్థ తాము ఎన్నుకున్న బాంకులో ఒక ఖాతాని తెరిచి పెట్టింది. ప్రతి నెల రెండు, మూడు తారీఖులలోపలే ఆ ఖాతాలోనే అతని జీతం, ప్రోత్సహాకాలు, బోనస్ లు వగైరాలు జమచేస్తున్నది.
బాంక్ ఇచ్చిన డెబిట్ కార్డ్ తో తనకు అవసరమైనప్పుడు అతని తనకి కావలసిన డబ్బుని డ్రా చేసుకునేవాడు. ఆ ఖాతని చూపించి కుమార్ ఒక మోటర్ సైకిల్ ని , ఒక ఆధునికమైన కంప్యూటర్ ని కొనుక్కున్నాడు. మామూలుగా ఋణ సౌకర్యం కలిపించే సంస్థ లు అతని దగ్గిర "పోస్ట్ డెటెడ్" చెక్కులని తీసుకునే ఇచ్చారు. తనకు కావల్సిన మ్యూజిక్ సిస్టం ని కొనుక్కునేటప్పుడు అతని జేబులో డబ్బు సరిపోలేదు. వెంటనే ఆ దగ్గిరలోనే ఉన్న తన బాంక్ ఏ టి ఎం కి వెళ్ళి డబ్బు డ్రా చేసి వారికి ఇచ్చి తన మ్యూజిక్ సిస్టం ని ఇంటికి తెచ్చుకున్నాడు.
సోమ వారం కుమార్ ఆఫీసుకు వెళ్ళలేదు. అతని "లీడ్" కుమార్ కి ఫోన్ చేసి , “ఎందుకని రాలేదు?" అని ఆదిగాడు. నీరసంగా ఉంది అందుకని రాలేకపొతున్నాను అని జవాబిచ్చాడు కుమార్. అతని గొంతులోని నీరసాన్ని గ్రహించిన అతని "లీడ్" జ్వరం ఉందా అని అడిగాడు. "లేదు కాని ..,”అంటూ నసిగాడు కుమార్. లీడ్ రొక్కించి అడిగేటప్పడికి "కుమార్" రెండు రోజులనుంచి ఏమి తినడం లేదు అని చెప్పాడు. “ఏందుకని, ఎమయ్యింది" అని "లీడ్" ఆదుర్దాగా అడిగాడు.
కుమార్ " డబ్బ్లు లేవు" అని జవాబిచ్చాడు.
“అదేమిటి, జీతం క్రెడిట్ అయ్యిందిగా? మరి ఇంక డబ్బుల ఇబ్బంది ఏముంది?” అని ఆశ్చర్యంగా అడిగాడు.
“ఏ.టి.ఏమ్ . కార్డ్ పోయింది. మరి డబ్బులెలా తీసుకోను" అని అమాయకంగా అడిగాడు, కుమార్.
“చెక్ బుక్ ఉందిగా, చెక్ రాసుకుని తీసుకెళ్ళి ఇవ్వు, వాళ్ళు డబ్బులు ఇస్తారు" అని చెప్పాడు "లీడ్ విస్తుపోతు.
“చెక్ ఎక్కడ ఇవ్వాలి?" అని అడిగాడు కుమార్.
కుమార్ పాతికవేల జీతగాడు. ఇంటర్ లో అతను 94% తో పాస్ అయ్యాడు.
Thursday, April 09, 2009
“చెక్ ఎక్కడ ఇవ్వాలి?"
Posted by Anil Atluri at 8:28 PM 1 comments
Labels: 2009, April, check.atm, cheque, life, skills, soft, నైపుణ్యాలు
Subscribe to:
Posts (Atom)