Saturday, December 15, 2007

అంతర్జాలం (Internet)లో వెదకడానికి కిటుకులు

లో మనం ఉద్యోగంలో చేరుదాం అనుకున్నప్పుడు ఆ కార్పరేట్ సంస్థ గురించి ఎలా తెలుసుకోవచ్చు అన్నది ప్రస్తావన. దానికి గతంలోనే వివరంగా వెబ్ సైట్స్ తో బాటు చాలా సమాచారం ఇచ్చాను. ఇక్కడ అవి కాకుండా గూగుల్ శోధనతో ఎలా తెలుసుకోవచ్చు అన్నవాటికి రెండు ఈ-బుక్స్‌ని ఇచ్చాను. ఈ కిటుకుల ద్వారా మీరు గూగుల్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకుని లాభిస్తారని అశిస్తున్నాను.
గూగుల్ సెర్చ్‌ని శక్తివంతంగా ఉపయోగించడానికి (తెలుగులొ) ఇక్కడ చూడండి.
దీనిని అందించిన వారు: శ్రీధర్ చందుపట్ల
శ్రీధర్ చందుపట్ల గారికి కృతజ్ఞతలు.
గూగుల్లో వెదకడానికి గూగుల్‌వారి గైడ్ (ఇంగ్లిష్‌లో) ఇక్కడ చూడండి.
ఇక్కడ పై రెండు ఫైల్సు మీరు డవున్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
రెండు ఉచితమే!

Thursday, November 29, 2007

A sample web résumé

Anil Rao
Albright University

Box C-23123

Cambridge, MA 02138

617-555-0392

anilrao@albright.edu

OBJECTIVE

EDUCATION


RELEVANT COURSES

To contribute my education and health management skills in a position with a growing and dynamic firm.

BACHELOR OF SCIENCE
Albright University, Cambridge, Massachusetts, May 2003
Major: Health Sciences
Minor: Management

  • Human Anatomy & Physiology I
  • Human Anatomy & Physiology II
  • Health Policy
  • Organizational Analysis and Health Care
  • Health Care Management
  • Human Resource Management

Health
Management
Skills

  • Served as Assistant to the Director of the Stacey G. Houndly Breast Cancer Foundation.
  • Functioned as Public Health Representative for the Cambridge Area Public Health Administration.
  • Coordinated, Harvard University Public Health Awareness Week, 1996, 1997.

Communications
Skills

  • Served as a phone-a-thon caller on several occasions, soliciting donations from Harvard alumni and parents for Harvard University.
  • Volunteered for a political campaign, distributing literature door to door, fielding questions and making phone calls to local constituents.

Management
Skills

  • Handled all back-office management functions, including employee relations and accounting.
  • Oversaw client relations, order processing and routine upkeep of the business.
  • Coordinated efforts between customer needs and group personnel.
  • Designed all market research analysis and projects for our client.
  • Delegated suggestions and duties to other team members.
  • Presented market research results to client with suggestions of implementation.

Leadership
Skills

  • Participated in Youth Leadership Boston, a group dedicated to developing leadership skills through diverse programming.
  • Served as formal/social coordinator for my sorority program council.
  • Elected Vice President of Risk Management for Panhellenic, a group that oversees and coordinates educational programming for Harvard's Greek system.

Systems
Abilities

  • Microsoft Office
  • HTML/Web Publishing
  • WordPerfect
  • PageMaker

* This is a sample résumé format.

Saturday, October 27, 2007

Assistant Editor - వెం‌టనే కావాలి


జనవరిలో ప్రారంభంకానున్న ఒక దినపత్రికకు అనుబంధంగా ప్రారంభించబడుతున్న web portal కి Assistant Editor కావాలి.

తెలుగు బాగా వచ్చా?
English ఇంకా బాగా వచ్చా?
అరె! మీకొసమే ఎదురుచూస్తున్నాము!

అంతర్జాలం దానికి సంభందించిన విషయాలమీద పూర్తి అవగాహన ఉందా? Portal సు వాటి content మీద మీకంటు కొంత స్వంత అభిప్రాయాలున్నవా? అవి పంచుకోగలరా? అనుభవం కూడా వుందా?
అయ్యొ. మరి ఇంకా అక్కడే నిలబడ్డారేం?

మీకు దాదాపు పాతికేళ్ళ వయసుందా?
ఐతే మీరు అర్హులే!

కనీసం graduation పూర్తి గావించారా?
ఐతే మరి ఇంక ఆలస్యం ఎందుకు?
అప్లై చెయ్యండి!

పగలే నండి ఉద్యోగం. Portal అన్నాంగదా?

జీతం ఎంతంటారా?
మీ ఉత్సాహము, అనుభవాన్నిబట్టి కనీసం నెలకి పది, పదిహేను వేల మధ్య ఉంటుంది?

ఉద్యోగం ఎక్కడంటారా?
భాగ్యనగరంలోనే!

మీకీ ఉద్యోగ అఖర్లేదా?
సరే మీకు తెలిసిన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి చెప్పి అప్లై చెయ్యమనండి.

ఫొనెందుకండి?

careers AT thus dot in కి
Subject లైన్‌లో Assistant Editor
అని వ్రాసి మీ అప్లికేషన్ పంపండి.

* referance ఇస్తే బాగుంటుంది. మా పనిని సులభంగా చేసుకోగలుగుతాం!

ప్రతి అప్లికెషన్‌కి జవాబు ఉంటుంది.
Waiting లొ పెట్టం.

Thursday, August 30, 2007

Tuesday, August 14, 2007

ప్రైవేటు రంగంలొ రిజర్వేషన్లు ఉండాలా?

యూ.పి ముఖ్యమంత్రి మాయావతి ప్రైవేట్ రంగంలొ కూడా రిజర్వేషన్లను అమలుపరచడానికి తగిన పనులన్ని పూర్తి చేసుకుంది. (ఈ వార్త ఇక్కడ).

* ఏవరేవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నయి?
వెనుకబడ్డ కులావారికి, ఆర్ధికముగా వెనుకబడివున్నవారికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

* ప్రైవేటు రంగంలొ ఏయే సంస్థలు ఈ రిజర్వేషన్లు పాటించాలి?

1 - కొత్తగా స్థాపించే సంస్థలకు మాత్రేమే ఇది వర్తిస్తుంది.

2 - ప్రభుత్వంలోని ఏ శాఖనుండిగాని, భూమిగాని, ఏదేని గ్రాంట్ గాని, కట్టే శిస్తులలో రాయితిగాని మరేవిధంగానైన సహాయంగాని పొందిన సంస్థలు ఈ రిజర్వేషన్లను అమలు పరచాలి.

* మరి ఏమేరకు ఈ సంస్థలు రిజర్వేషలని అమలు చెయ్యాలి?

30 శాతం దాక అమలు చెయ్యాలి.

సంభందిత శాఖా, రాష్త్ర కార్మిక శాఖ, ఆ సంస్థ యాజమాన్యం రిజర్వేషన్ని సరిగ్గా అమలుపరుస్తుందాలేదా అన్నది పర్యవేక్చ్చిస్తుంటయి.

మన ముఖ్యమంత్రిగారు కూడా దానిని మన రాష్త్రంలో కూడా ప్రయోగించి పాటించడానికి కసరత్తులు మోదలుపెట్టారు.
(ఈ వార్త ఇక్కడ).
యూ.పి వారి పాలసి విధి విధానలని తెప్పిస్తున్నారు. కూలంకషంకా దానిని పరిశీలించి బహుశ
ఈ రాష్ట్రానికి కావల్సిన, చేయాల్సిన మార్పులు చేర్పులు చేసి తగిన చట్టాన్ని అమలులోకి తీసుకువస్తారు.

దీనికి మరి మీరు ఏమంటారో తెలియజేయగలరా?

Friday, July 06, 2007

తప్పెవరిది (2) ?

ఆ విద్యార్ధి సాఫ్ట్ స్కిల్ల్స్‌లో ట్రైనింగ్ ఇచ్చాను అని చెప్పుకుంటున్న సాఫ్ట్ స్కిల్ల్స్ ట్రైనర్ ది. ఆ ట్రైనర్ ఇచ్చే ట్రైనింగ్, దాని పర్ఫార్మన్స్ని మానిటర్ చెయ్యని మేనజ్‌మెంట్‌ది. "పేరు గొప్ప , ఊరు దిబ్బ" అన్నట్టు ఆ ఆ కాలేజికి, వివిధ నగరాలలో చాలా బ్రాంచెస్ ఉన్నవి. అబ్బొ, సానా లావు పేరు కూడా ఉన్నది. ఫీజుల్స్ గ ట్రా కూడా బానే గుంజుకుంటారు.
అంతేనా అంటే కాదు.

మా కాలేజిలొ చదువుకున్న వారందరికి " ఉద్యొగాలు గారంటీ "అంటారు. ఎందుకంటే వారి కాలేజిల్లో "కాంపస్ ఇంటెర్వ్యు" లు వచ్చేస్తవి కాబట్టి.

మా కాలేజీ విద్యార్ధికి సగటున 15 వేలు తగ్గకుండా జీతం వస్తుంది అని కాలరెగరేసుకుంటు చెప్తారు.
బేనిఫిట్స్, ఫ్రింజ్ బెనిఫిట్స్ కూడా వుంటాయని ఆకర్షణియంగా చెబుతారు.

అంతటితో ఐపొయిందా అంటే అబ్బే కాదు.
ఒకవేళ ఎవరి ద్వారానో, ఎందుకులేండి, విద్యార్ధి శక్తి యుక్టులకు మెచ్చి ఎవరన్నా ఉద్యొగం ఇస్తే, అందులో చేరనివ్వరు.

అదేందుకు అని అడగండి.

ఎందుకంటే ఒక విద్యార్ధి తక్కువ జీతానికి అంగీకరిస్తే మిగతా సంస్థలు కూడా అదే జీతం ఆఫర్ చెస్తే తమ కాలేజ్ ఉనికికి ప్రమాదం కదా.
అందుకని.
ముందు ఓపికగా నచ్చచెబుతారు. ఒద్దమ్మా అని.
నువ్వు జాఇన్ ఐపోతావు, మరి నీ తొటి వారి సంగతేమిటీని మాట మార్చి 'సెంటిమెంట్'ని వొదులుతారు, నెమ్మదిగా.
తరువాత, మొదలవుతుంది.
బెదిరింపుల సెక్షను.
నువ్వు జాయిన్ అవ్వకూడదు, అని హుకుం పారేస్తారు.

ఈ మధ్యతరగతి కుటుంబంలోని వారు, తమ పిల్లలకు ఎటూ ఆస్తులివ్వలేము, కనీసం చదువులన్నా ఇద్దామని అనుకోవడంలో తప్పులేదుగా.

అందుకని, వాడి కాళ్ళు, వీడి కాళ్ళు పట్టుకుని, ఆ బాంకు వాడిని, ఈ బాంకు వాడిని దేవిరించి ఎంతొకొంత అప్పు చేసి, వారిని చదువించుకుంటారు. ఆ అప్పు తీచే బాధ్యత తమదని ఎరిగిన పిల్లలు ఎదో ఒక ఉద్యొగంలో జాఇన్అయి, ఆ అప్పు తీర్చుకోవాలనుకొవడం తప్పా?

వారికి తగిన ఉద్యొగాలను వారు ఎంచుకుని జాఇన్ అవుదామనుకుంటే వారిని అందులో జాఇన్ కాకుండా అపే ఈ కాలేజ్ మేనేజ్‌మెంట్‌ని ఏమనాలి?

* * *


"శిలలపై శిల్పాలు చెక్కినారు" అని మనకి ఒక సినిమా పాట ఉంది. "శిలలైతే చెక్కవచ్చు సార్, వీళ్ళు శిలలు కాదు, గులక రాళ్ళు. వీళ్ళని తీర్చి దిద్దడం మా వల్ల కాదు. ఎదో మా బ్రతుకు తెరువు కోసం, ఈ ఉద్యొగం చేసుకుంటున్నాము. ఎదో చూసి , చూడనట్టు నెట్టేయండి సార్", అన్న ఆ సాఫ్ట్ స్కిల్ల్స్ ట్రైనర్ మాటలు గుర్తొస్తున్నాయి.

తప్పేవరిది?

మారుతున్న కాలంతొ బాటు వస్తున్న మార్పులని గమనించి,జీవనానికి కావలసిన కనీసపు నైపుణ్యాలను అందించలేని ఈ విద్యా వ్యవస్థదా?

కాలేజి చదువులదాకా, బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న విద్యార్ధులదా?

కనీసపు స్కిల్ల్స్ లేని విద్యార్దులని తీసుకోలేమంటున్న కార్పరేట్ రంగానిదా?

విపరీతమైన పోటీలున్న ఈ జీవితంలో ఈ ఒంటరి విద్యార్ధి ఓటమిని అంగికరించలేక, క్షణికమైన మానసిక దౌర్బల్యంతొ, ఏదేని అఘాయిత్యానికి ఒడిగడితే ఎవరు జవాబుదారి?

ఎవరు ?

Friday, June 29, 2007

తప్పెవరిది ?

భాగ్యనగరం హెడ్డ్ ఆఫీసుగా, మిగతా నగరాలాలో, ఇతర రాష్ట్రాలలోను మేనేజ్ మెంట్ కోర్సులను ఆఫర్ చేసె ఒకానొక యునివర్సిటి విద్యార్ధిని, ఉద్యోగార్ధియై మా దగ్గిరకు వచ్చింది.

అ అప్లికేషన్ క్జెరాక్జ్స్ (Xerox) కాపీ అంటే ఫొటొస్టాట్ అన్నమాట. అసలుదికాదు. నకలు. అంటే ఒక పది సంస్థలకు దరఖాస్తులు పెట్టుకున్న తరువాత ఇంకా ఎమిటిలే ఇంకొక బోడి ఉద్యోగమేగా దానికి ఈమాత్రం చాలులే అన్న ధోరణి ఆ అప్లికేషన్ చూడగానే కనపడుతుంది. నకలు కదా అందుకని దానినిండా కొట్టివేతలు, తుడుపులు, దిద్దివేతలును. అంతటితో ఐతే ఫరవాలేదు. దాని నిండా షూ హీల్స్ బురద మరకలు. వాటన్నింటితోనూతోను చక్కగా ముస్తా బై ఉన్నదది.

"అమ్మో, అమ్మో", అనుకుంటూ (సూర్యకాంతంలా) ఆ అప్ప్లికేషన్ ఓనరైన ఆ సదరు అభ్యర్ధిని నా వరకు రానివ్వకుండానే వెనక్కి పంపించేసాను. ఆ అమ్మాయి భొరున విలపిస్తు బక్కిట్లకొద్ది కన్నీరు కార్చిందంట. అబ్బే, మావాళ్ళు ఏమాత్రము కరగలేదు.

తప్పు ఆ విద్యార్ధినిదికాదు.
మరి ఎవరిది ?

(ఇంకా ఉంది)

Sunday, January 14, 2007

How To Tie a Tie

This is a very simple knot - very easy to tie.